PLD: ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి కోటప్పకొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఈ ఊరి అసలు పేరు కొండకావూరు, కానీ ఇప్పుడు కోటప్పకొండ అని త్రికూటపర్వతమని పిలుస్తారు. అన్ని దిశల నుంచి శిఖరాలు మాత్రమే కనిపించడం ఆలయం ప్రత్యేకత.