SRD: జహీరాబాద్లోని అల్గొల్ రోడ్లోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ను నిర్వాహకులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 25 నుండి 27 వరకు జాతర కొనసాగుతుందని అన్నారు. మూడు రోజుల పాటు దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు.