టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్‌పై సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. శాంసన్ ఒక అద్భుతమైన ఆటగాడని ఆయన ప్రశంసించాడు. వైట్ బాల్ క్రికెట్లో భారత్ తరపున సంజూ నిలకడగా అవకాశాలు పొందాలని అభిప్రాయపడ్డాడు. అతడు ఒకసారి క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి జట్టుకు భారీ నష్టం చేకూర్చగలడని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటం అతనిలోని గొప్ప లక్షణమని కొనియాడాడు.