RK Roja: అచ్చెన్నాయుడు వైసీపీలోకి రావడానికి ప్రయత్నం, శ్రీదేవికి రోజా సవాల్
తెలుగు దేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తమ పార్టీలోకి రావడానికి వైసీపీ నేతలతో టచ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. లేదంటే తమ పార్టీ నాయకులు ఆయనతో టచ్ లో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.
తెలుగు దేశం పార్టీతో (Telugu Desam) 40 నుండి 60 మంది టచ్ లో ఉన్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆంద్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (AP Minister RK Roja) వ్యాఖ్యానించారు. బుధవారం తిరుపతి శిల్పారామంలో అఖిల భారత డ్వాక్రా బజారు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో (YCP to contest 175 seats) ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (tdp leader achennannaidu) చెబుతుంటే, వైసీపీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు 60 మంది ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎన్టీఆర్ ను గుర్తుంచుకోని చంద్రబాబు (Chandrababu Naidu) ఎన్నికలు దగ్గర పడటంతో ఆవిర్భావ దినోత్సవాల పేరుతో సంబరాలు చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు, లోకేష్ కు ఎన్టీఆర్ పైన గౌరవం, ప్రేమ ఉంటే టీడీపీ హయాంలో కాలేజీలు, యూనివర్సిటీలకు ఎన్టీఆర్ (NTR) పేరు ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు. ఎన్టీఆర్ ను కరివేపాకులా వాడుకోవడమే తెలుసునని చెప్పారు. తన యువగళం పాదయాత్రలో లోకేష్ (Nara Lokesh Yuvagalam) ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని హితవు పలికారు.
అసలు వైసీపీ నుండి టీడీపీకి (TDP) ఎందుకు టచ్ లో ఉన్నారో చెప్పాలని నిలదీశారు. ఆ పార్టీలో అభ్యర్థులు లేకపోవడం వల్ల తమ పార్టీ వారు టచ్ లో ఉన్నారా లేక ఎలాగూ టీడీపీ మూసివేస్తారు కాబట్టి వైసీపీ (YCP) నేతల ద్వారా జగన్ తో (Jaganmohan Reddy) మాట్లాడేందుకు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారా చెప్పాలన్నారు. తామకు 175 చోట్ల అభ్యర్థులు ఉన్నారని, కానీ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan), తెలుగు దేశం పార్టీకి (Telugu Desam) 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదన్నారు. అసలు వైసీపీలోకి రావడానికి వారు తమ పార్టీకి చెందిన నేతలతో టచ్ లో ఉన్నట్లుగా తేలిపోయిందన్నారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పష్టతను ఇవ్వాలన్నారు. తెరపైకి కుల రాజకీయాలు తీసుకు రావడం వారికి పరిపాటిగా మారిందన్నారు. ప్రజలకు ఏం కావాలో జగన్ అన్నీ చేస్తున్నారని, అందుకే ఆయనను గుండెల్లో పెట్టుకున్నారన్నారు.
ఇచ్చిన హామీలు, చేసిన పనులను చూస్తే చంద్రబాబుకు, జగన్ కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ఏపీ ప్రజలు టీడీపీకి అవకాశమిస్తే చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి వారికి అవకాశం ఇవ్వవద్దని చేతులు ఎత్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. అమరావతిలో ఏం కట్టకుండానే డిజైన్లు చూపించి, చంద్రబాబు మోసం చేశారని, ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి (vundavalli sridevi) టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతోందన్నారు. 2019లో తమ పార్టీ నుండి గెలిచి శ్రీదేవి.. 2024లో జై అమరావతి నినాదంతో పోటీ చేయాలని సవాల్ చేశారు.