SKLM: ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి సర్పంచ్ పిట్ట శశిరేఖ చెక్ పవర్‌ను రద్దు చేసినట్టు ఎంపీడీఓ రామారావు శుక్రవారం తెలిపారు. 2021 నుంచి 2025 వరకు నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్య పనుల్లో సర్పంచ్ రూ.85 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్లు పలుమార్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని అన్నారు.