AP: అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి ఘటన యువతిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిని కత్తితో పొడిచి ముఖంపై గణేష్ అనే యువకుడు యాసిడ్ పోసిన విషయం తెలిసిందే. గణేష్ మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ 29న యువతి పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.