NZB: నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ బుధవారం జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను సీఐ రవీందర్ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు జరగకుండా గ్రామాల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి పద్ధతుల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.