తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 10ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘పదేళ్ల క్రితం రిలీజైన ‘పటాస్’ మూవీ నా జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతీ మూమెంట్, ప్రతీ క్షణం, ప్రతీ సవాల్ పాఠం నేర్పించాయి. నా జర్నీలో భాగమైన ప్రతిపక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు.