ప్రకాశం: ఉచిత పశు వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని సంతనూతలపాడు మండల పశు వైద్యాధికారి డా.చిరంజీవి పశుపోషకులను కోరారు. మండలంలోని వేములపాడు, గురవారెడ్డి పాలెంలలో బుధవారం వైద్య శిబిరాలను నిర్వహించి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును తాగించారు. పలు చికిత్సలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.