SRCL: వేములవాడ పట్టణంలో బుధవారం విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. మహా శివరాత్రి జాతర నేపథ్యంలో ముందస్తు పనులలో భాగంగా విద్యుత్ మరమ్మతులు చేపట్టామని టౌన్ సెస్ ఏఈ సిద్దార్థ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలోని భగవంతరావ్ నగర్, భీమేశ్వర, బద్ది టెంపుల్, పోలీస్ స్టేషన్, అంబేద్కర్ విగ్రహం ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుదని అన్నారు.