NGKL: వెల్దండ మండలంలోని వివిధ గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని తహశీల్దార్ కార్తీక్ కుమార్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామసభల ద్వారా కొత్త రేషన్ కార్డు జాబితా సిద్ధం చేస్తామని, జాబితాలో లబ్ధిదారుల పేరు ఉన్నది.. లేనిది చూసుకోవాలన్నారు. జాబితాలో పేరు లేకపోతే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.