ATP: హిందూపురం ప్రత్యేక న్యాయమూర్తిగా రమణయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి పదవీ విరమణ చేయడంతో నాలుగేళ్లుగా ఖాళీగా ఉంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఖాళీగా ఉన్న ప్రత్యేక న్యాయమూర్తి పోస్టులను భర్తీ చేయడంతో రమణయ్యను హిందూపురం ప్రత్యేక న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆయన ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు.