KNR: రామడుగు మండలంలోని వెదిర, గోపాల్ రావుపేట గ్రామాల్లో అధికారులు నిర్వహిస్తున్న రైతు భరోసా సర్వేను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అధికారులు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. సర్వే విషయంలో పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.