కృష్ణా: గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈనెల 26న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.