GDL: మానవపాడు మండలంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. మండల పరిధిలోని బొంకురు గ్రామానికి చెందిన రైతు శేఖర్ రెడ్డి మిర్చి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంట సాగు చేయడానికి అప్పు చేశారు. చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక పొలంలో పురుగు మందు తాగి మృతి చెందాడు.