కోనసీమ: అంబాజీపేట – గన్నవరం రహదారిని రోడ్లు&భవనాల శాఖ సుమారు 20రోజుల పాటు మూసివేయనున్నారు. రూ.10 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా పి.గన్నవరం నుంచి పోతవరం వరకు కిలోమీటర్ మేర సీసీగా మారుస్తారు. ఈ మేరకు 20 రోజుల పాటు మూసేయాల్సి ఉంటుందని ఆ శాఖ డీఈఈ జి.రాజేంద్ర గురువారం తెలిపారు. ఈ నెల 20 నుంచి పనులు మొదలు పెడతామన్నారు.