అన్నమయ్య: ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం కింద సోమశిల బ్యాక్ వాటర్‌ను గురువారం తిరిగి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం చెరువు వద్ద గంగమ్మకు జలహారతి పట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట చెరువు నీటి సంఘం అధ్యక్షులు గంగిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.