ASR: కొయ్యూరు మండలం పనసలపాడు గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి మార్గం సుగమం అయింది. గ్రామంలో నెలకొన్న స్థల వివాదం నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా భవన నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి. శుక్రవారం మండల తహసీల్దార్ ఎస్ఎల్వీ ప్రసాద్, సర్వేయర్ నరసింహమూర్తి గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు, పెద్దలు చూపించిన స్థలంలోనే నూతన భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.