HNK: దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్త్యాలపల్లి గ్రామంలో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్కిల్ వద్ద దాడులు చేశారు. బెల్ట్ షాపులో రూ.2380 విలువైన మద్యం స్వాదీనం చేసుకొని, షాపు నిర్వాహకుడు కేదాసి రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సె కొంక అశోక్ తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.