MHBD: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన డోనికేనా యాకన్న(38) శుక్రవారం సాయంత్రం పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వైద్యం కోసం తొర్రూరుకు తరలించారు. చికిత్సపొందుతూ శనివారం రాత్రి 11:30 గంటలకు మృతిచెందాడు.