అన్నమయ్య: విషం తాగి భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్రంకొండ ఎస్సై మధురామ చంద్రుడు తెలిపారు. తరిగొండ గ్రామం బొడ్డువారిపల్లెకు చెందిన నూరుఖాన్(35) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబ సమస్యలు కారణంగా శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో, కుటుంబీకులు బాధితుడిని 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.