ADB: జన్నారం మండలంలోని వివిధ వాగులపై మంజూరైన వంతెనలు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జన్నారం గ్రామ శివారులో ఉన్న పెద్ద వాగుపై గతంలో వంతెన మంజూరైంది. ఎన్నికల సమయం కావడంతో ఆ వంతెన నిర్మాణం చేపట్టలేదు. అలాగే రోటిగూడ శివారులో ఉన్న వాగుపై లో లెవెల్ వంతెన ఉంది. దాని స్థానంలో హై లెవెల్ వంతెన మంజూరు అయింది. ఆ వంతెనలు పూర్తి చేయాలని ప్రజలు కోరారు.