SRPT: అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్ పహాడ్ మండలం దూపాద్ గ్రామంలో సీపీఎం మండల కమిటీ సమావే శంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు అనేక వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.