HYD: సికింద్రాబాద్లో ఆర్పీఎఫ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గోవా నుంచి మద్యం తరలిస్తుండగా 95 మద్యం బాటిళ్లు (82. 38 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి అతి తక్కువ ధరకు హైదరాబాద్కు తీసుకొచ్చి న్యూ ఇయర్ వేళ అమ్మేందుకు ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆర్పీఎఫ్ పోలీసులు ముఠా ప్లానుకు చెక్ పెట్టారు.