HYD: ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పసునూరి రవీందర్ రచించిన మట్టి మేధావి కొల్లూరు సత్తయ్య పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కంచె ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అట్టడుగు వర్గంలో చదువు రాని కూలీగా సత్తయ్య జీవితం మొదలైందని పేర్కొన్నారు.