GDWL: సోషల్ మీడియాలో నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గద్వాల జిల్లా అయిజ ఎస్ఐ విజయభాస్కర్ శనివారం హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, సామాజిక అంశాలపై ఎలాంటి ఆధారాలు లేకుండా పోస్టులు పెట్టరాదన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచి, పర్యవేక్షణ చేస్తామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.