MHBD: కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నేడు గ్రామ పంచాయతీ ఉద్యోగుల ధర్నా చేశారు. గ్రామపంచాయతీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీసం వేతనం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం సమర్పించారు.