సంగారెడ్డి: చలి తీవ్రత నుంచి వరి నారు సంరక్షించుకోవాలని నారాయణఖేడ్ డివిజన్ వ్యవసాయ సహాయ డైరెక్టర్ నూతన్ కుమార్ రైతులకు సూచించారు. కల్హేర్ మండలం మీర్ఖాన్ పేట్, నిజాంపేట మండలం రామ్ రెడ్డి పేటలో రైతులకు పంట సాగు అంశాలపై అవగాహన కల్పించారు. వరి కొయ్యలను పొలంలోనే కలియ దున్నాలని రైతులకు వివరించారు. ఏఈఓలు వంశీ గౌడ్, కృష్ణవేణి, రైతులు భూమేష్, సత్తయ్య పాల్గొన్నారు.