MNCL: చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని ఆది శంకరాచార్య పత్తి మిల్లు వద్ద శనివారం పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. మిల్లులో పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని కొనుగోలు చేయకపోవడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. వెంటనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.