»Minister Puvvada Launched The New Ac Sleeper Buses
Lahari AC Sleeper bus : నూతన ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
హైదరాబాద్ (Hyderabad) ఎల్బీనగర్లో టీఎస్ఆర్టీసీ 9 ఉచిత వై-వై ఏసీ స్లీపర్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvwada Ajay) ప్రారంభించారు. కొత్తగా 760 బస్సులను ఆర్డర్ ఇవ్వగా వాటిలో 400లకు పైగా డిపోలకు చేరుకునట్లు మత్రి చెప్పారు. అత్యాధునికమైన హంగులు జోడించిన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ (TS RTC) తొలిసారి ప్రారంభించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై (Free Wi-Fi) సౌకర్యాన్ని ఈ బస్సులలో అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్ (Hyderabad) ఎల్బీనగర్లో టీఎస్ఆర్టీసీ 9 ఉచిత వై-వై ఏసీ స్లీపర్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvwada Ajay) ప్రారంభించారు. కొత్తగా 760 బస్సులను ఆర్డర్ ఇవ్వగా వాటిలో 400లకు పైగా డిపోలకు చేరుకునట్లు మత్రి చెప్పారు. అత్యాధునికమైన హంగులు జోడించిన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ (TS RTC) తొలిసారి ప్రారంభించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై (Free Wi-Fi) సౌకర్యాన్ని ఈ బస్సులలో అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 16 బస్సులను కొనుగోలు చేయగా.. అందులో 9 బస్సులను ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ (LB NAGAR) చౌరస్తాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన బస్సులను పలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నడపనున్నారు.
త్వరలో 1,300 ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(MLA Bajireddy Govardhan), ఎండీ వీసీ సజ్జనార్ (MD VC Sajjanar) పాల్గొన్నారు. ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా (Lahari AC Sleeper bus) నామరణం చేసిన ఈ బస్సులు బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో సేవలు అందించనున్నాయి. ఈ ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులలో ప్రయాణికుల భద్రతకు ట్రాకింగ్ సిస్టంతో పాటు ‘పానిక్ బటన్’ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉండేలా వీటిని రూపొందించారు.ఈ లహరి (Lahari) ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సు లోపల సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్- అలారం సిస్టమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టం లాంటి అత్యాధునిక హంగులను జోడించారు.
ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBusespic.twitter.com/WBrFy37xmt
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) March 26, 2023