W.G: పెంటపాడు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న మంచినీటి చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన దాడి వెంకటరమణ (40)గా గుర్తించారు. స్థానికంగా అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడని మృతుని బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి పెంటపాడు ఏఎస్ఐ రాజేంద్ర, కానిస్టేబుల్ శ్రీనివాస్ చేరుకున్నారు.