KKD: రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎక్కడైనా పేకాట, గుండాట వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జగ్గంపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం గతంలో కోడిపందాలు నిర్వహించిన జగ్గంపేట శివారు బాలాజీ నగర్ దగ్గరలో ఉన్న మర్రిపాక గ్రామానికి చెందిన కోడిపందెం బరులను పరిశీలించారు.