GDWL: అయిజ మున్సిపల్ కేంద్రంలో అసంపూర్ణంగా నిర్మించిన పెద్ద వాగు బ్రిడ్జ్‌పై గురువారం డేవిడ్ అనే యువకుడు ప్రమాదానికి గురై కర్నూల్లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మరణించాడు. బ్రిడ్జ్ స్లాబ్ రోడ్డు కంటే ఎత్తుగా ఉండటంతో వాహనదారులు గమనించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే బ్రిడ్జిపై మూడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.