SKLM: రణస్థలం మండలం నెలివాడ గ్రామంలో ఈరోజు పైవంతెన కింద నుంచి పీసీని గ్రామానికి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని శ్రీకాకుళం-విశాఖపట్నం వెళుతున్న RTC బస్సు ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇజ్జాడ త్రినాధరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన 108 అంబులెన్సులో శ్రీకాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.