SKLM: టెక్కలి మండలం స్థానిక జగతిమెట్ట సమీప సర్వీస్ రోడ్లో గురువారం ఉదయం కారు ఢీకొని వ్యక్తికి తలకు బలమైన గాయం అయ్యింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.