NRML: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాదాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నల్గొండ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి 6 వ విద్య వైజ్ఞానిక మహాసభ పోస్టర్లను గురువారం నిర్మల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు దాసరి శంకర్, అశోక్ మాట్లాడుతూ.. మహాసభలకు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.