WGL: కొడకండ్లలో ఎల్‌హెచ్‌పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు గుగులోతు వీరేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ పాల్గొని మాట్లాడారు. మైదాన ప్రాంత లంబాడీల అభివృద్ధి కోసం ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.