MHBD: క్వారీ గుంతలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలిసులు అనుమానిస్తున్న ఘటన తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న చెప్పుల ఆధారంగా బాధితుడు అమ్మాపురం గ్రామానికి చెందిన హరీశ్(17)గా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.