YS Sharmila:నీ వాటా, కోటా కోసం అంటూ కేటీఆర్‌పై షర్మిల ఫైర్
YS Sharmila:పేపర్ లీకేజ్ ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతూనే ఉంది. ఈ ఇష్యూపై విపక్ష నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు.
YS Sharmila:పేపర్ లీకేజ్ ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతూనే ఉంది. ఈ ఇష్యూపై విపక్ష నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మంత్రి కేటీఆర్‌పై (ktr) వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (sharmila) మరోసారి విరుచుకుపడ్డారు. చిన్న దొర అంటూ ఫైర్ అవుతున్నారు.
‘అన్నింటికీ పెద్ద ముత్తైదువ నేనే అని, మొదటి తాంబూలం నాకే అని, ఉరికి ఉరికి మీటింగులు పెడితివి కదా కూతల రామారావు. ఈరోజు లీకేజీ బండారం బయటపడేసరికి TSPSC వ్యవహారం నీకు సంబంధం లేని సంత అయిందా? నీ వాటా, నీ కోటా, నీ హస్తం, నీ దోస్తులు ఉన్నారని తెలిసేసరికి.. TSPSC అక్రమమైందా? స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థలు సర్కారు పరిధిలో ఉండవని బొంకుతున్నావా? TSPSC మీ ఆధీనంలో లేకపోతే TSPSC సభ్యులను నియమించినందుకు కోర్టుకు నువ్వు ఎందుకు సంజాయిషీ ఇచ్చుకున్నావు? TSPSC చైర్మన్ ని నియమించనందుకు నువ్వెందుకు కోర్టు మొట్టికాయలు తిన్నావు? నీకేం సంబంధం లేకుంటే నీది కాని శాఖల మంత్రులతో నువ్వు ఎందుకు రివ్యూలు చేస్తున్నావు? అన్ని సక్రమంగా జరిగితే క్రెడిట్ మీదా?ఏదైనా అక్రమం జరిగితే, ఆ తప్పు అధికారులదా? మొన్నటి దాకా TSPSC ద్వారా లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని డబ్బా కొట్టుకున్న రామారావు, ఈ రోజు పేపర్ లీకేజీ వ్యవహారం బయటికి రాగానే TSPSCకి రాంరాం అంటున్నావు. TSPSC స్వతంత్య్ర వ్యవస్థ అని కూనిరాగాలు తీస్తూ.. ప్రతిపక్షాల మీద కేసులు పెడుతూ.. నీ తప్పును కప్పిపుచ్చాలని చూస్తున్నావు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న నిన్ను రాజీనామా చేయమనడం తప్పా? లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు ఉంటే అసలు ఖాళీలే లేవని బుకాయిస్తూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కొందరు నిరుద్యోగులను చంపారు. 26వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇచ్చి, ఇప్పుడు గ్రూప్-1 పేపర్లు అమ్ముకొని, మిగిలినోళ్లని చంపుతున్నారు. మీరు సుద్ద పూసలే అయితే CBIతో విచారణ చేయించు’ అని షర్మిల సవాల్ విసిరారు.
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ (praveen) 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడని తెలిసింది. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నారని సమాచారం. 40 మంది మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడని తెలిసింది. మరొకరు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని ఇటీవల మంత్రి కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.