Global Star RamCharan: ఆర్సీ15 షూటింగ్ సెట్లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు
మార్చి 27న రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు కావడంతో సెట్స్ లో అందరూ సందడి చేశారు. యూనిట్ సభ్యుల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్ నడిచి వచ్చే సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు గులాబీ రేకుల వర్షాన్ని కురిపించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star RamCharan) ఆర్సీ 15 షూటింగ్లో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్(Sankar) దర్శకత్వంలో ఆయన ఆర్సీ15(RC15) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా హీరో రామ్ చరణ్(Ramcharan), హీరోయిన్ కియారా అద్వానీలపై ఓ బ్యూటిఫుల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ చిత్రీకరించింది. ఈ పాట షూటింగ్ శనివారంతో ముగిసింది.
ఇకపోతే మార్చి 27న రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు కావడంతో సెట్స్ లో అందరూ సందడి చేశారు. యూనిట్ సభ్యుల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్ నడిచి వచ్చే సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు గులాబీ రేకుల వర్షాన్ని కురిపించారు.
ఈ సెలబ్రేషన్స్‌లో డైరెక్టర్ శంకర్(Sankar), రామ్ చరణ్(Ramcharan), కియారా అద్వానీతో పాటుగా నిర్మాత దిల్ రాజు(Dil Raju), స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, మరో కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్, చిత్ర యూనిట్ పాల్గొంది. రామ్ చరణ్ కు అందరూ ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు(Birthday Wishes) తెలిపి సందడి చేశారు. ప్రస్తుతం ఆ సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.