దీపావళి కానుకగా నాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నీ యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకున్నాయి. దాంతో ‘జిన్నా’, ‘ఓరి దేవుడా’, ‘సర్దార్’, ‘ప్రిన్స్’.. సినిమాల ప్రభావం కన్నడ సినిమా ‘కాంతార'(kantara) పై ఏ మాత్రం పడలేదనే చెప్పాలి. తెలుగులో ఈనెల 15వ తేదీన విడుదలైన ‘కాంతార’.. ఇంకా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. రెండు రాష్ట్రాల్లో కలుపుకుని పది రోజుల్లో 27 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో మొత్తంగా 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందంటున్నారు.
తెలుగులో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ఈ సినిమాను రిలీజ్ చేసింది. ఈ లెక్కన చూస్తే.. కాంతార థియేట్రికల్ రైట్స్‌కు 7 రెట్లు లాభం వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఓ వైపు ‘కాంతార’ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంటే.. మరో వైపు కాపీ వివాదం చుట్టుముడుతోంది. ఈ సినిమాలో ‘వారహ రూపం.. దైవ వరిష్టం..’ అనే పాట కాపీ అంటూ మలయాళంకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తోంది.
అంతేకాదు.. దీనిపై లీగల్‌గా యాక్షన్ తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. గతంలో నవరసం పేరుతో చేసిన మ్యూజిక్ ఆల్బమ్‌లోని ఓ ట్యూన్.. కాంతార సినిమాలోని వరాహ రూపం ట్యూన్ ఒకేలా ఉందనేది వారి వాదన. అందుకే కాంతార చిత్ర యూనిట్‌కి లీగల్ నోటీసులు పంపిస్తున్నాం.. అని సోషల్ మీడియాలో తెలిపారు. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ స్పందించలేదు. ఏదేమైనా.. సరే కాంతార సాంగ్ మాత్రం హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.