ఈ మధ్యకాలంలో అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ సాధించిన సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. దర్శకుడు రిషబ్ శెట్టి తానే హీరోగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కేవలం రూ.15 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాకు కేవలం రూ.2.5 కోట్ల బిజినెస్ వచ్చింది. మొత్తంగా చూసే సరికి ఈ సినిమాకు తెలుగులో ముప్పై కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలై అదరగొట్టింది.
తాజాగా ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అయ్యింది. స్టార్ మాలో ప్రసారం అయిన ఈ సినిమాకు 12.35 రేటింగ్ రావడంతో మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మధ్యకాలంలో తెలుగు స్ట్రెయిట్ సినిమాల టీఆర్పీలు దాదాపు పదిలోపే వస్తున్నాయి. అలాంటిది కాంతారా సినిమాకు అత్యధిక టీఆర్పీ నమోదైంది. చిరు గాడ్‌ఫాదర్ కూడా కేవలం 7.69 టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. కాంతారా 12.35 టీఆర్పీ రేటింగ్‌తో అటు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ప్రభంజనం సృష్టించింది.