TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ను విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే, బౌన్సర్ల గురించి ప్రశ్నించిన సందర్భంగా బన్నీ తడబడినట్లు తెలుస్తోంది. బౌన్సర్ల నియామకంపై, బౌన్సర్ల తీరుపై ఏం అడిగినా అల్లు అర్జున్ ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయాను’ అనే రీతిలో స్పందించినట్లు సమాచారం. కాగా, 2 రోజుల క్రితం అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని అరెస్టు చేశారు.