TG: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ విచారణ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. కాగా, పీఎస్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.