ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ అంత్యక్రియలను ఇవాళ ముంబైలో నిర్వహించనున్నారు. ఆర్థిక రాజధానిలోని శివాజీ పార్కులో బెనెగల్ అంత్యక్రియలను చేపట్టనున్నారు. బెనెగల్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన.. నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.