అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మంచి వసూళ్లు రాబడుతోంది. మరోవైపు టికెట్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుక్ మై షోలో మూవీ రిలీజైన 17 రోజుల్లోనే 18 మిలియన్స్ బుకింగ్స్‌తో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు KGF 2 17.01 మిలియన్స్ బుకింగ్స్‌తో టాప్‌లో ఉండగా.. తాజాగా దాన్ని ఈ మూవీ బ్రేక్ చేసి నెంబర్ 1గా నిలిచింది.