కాసేపట్లో తన లీగల్ టీమ్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భేటీ కానున్నారు. అనంతరం తన లీగల్ టీమ్‌తో కలిసి చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లనున్నారు. బన్నీకి BNS 35(3) కింద నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి ఇవాళ బన్నీని చిక్కడపల్లి ACP రమేష్, సీఐ రాజు విచారించనున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు.