అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్’. ఈ మూవీలోని రెండో పాట ‘శివ శక్తి’ ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న విడుదలవుతుంది.