GDL: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతిని పురస్కరించుకొని 25 వ తేదీన అయిజలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరంలో యువతీ యువకులు పాల్గొని ప్రాణదాతలు కావాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అయిజలోని పార్టీ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ తాహెర్తో కలిసి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.