కృష్ణా: మండల కేంద్రమైన గన్నవరం పట్టణంలో ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ వెంకటరెడ్డి కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా జిల్లాల ఏపీ ఫైబర్ నెట్ వర్క్ కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు సెటప్ బాక్స్ రెంటల్ రూ. 59 తొలగించాలని కోరినట్లు తెలిపారు.